Breaking News

సుకుమార్ ఏది చెపితే అది 5 ఏళ్ల పాటు పిచ్చోళ్లా చేశాం : అల్లు అర్జున్

Published on Sun, 02/09/2025 - 08:56

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 1895 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో తాజాగా ‘థ్యాంక్స్‌ మీట్‌’ ఏర్పాటు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించారు. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో బన్నీ తొలిసారి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ వేదికపై  అల్లు అర్జున్  మాట్లాడుతూ.. 'పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్‌ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్‌ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్‌ లభించింది.

పుష్ప సమయంలోనే కోవిడ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్‌ టైమ్‌లో కూడా చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా జాతర షూటింగ్‌ లాస్ట్ వరకు చూస్తానా అనిపించేది . మైత్రి మూవీస్ లాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే పుష్ప లాంటి సినిమా రాదు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ, చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్‌ చేశాం. ‘పుష్ప’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. 5 సంవత్సరాలు సుకుమార్ ఏది చెపితే అది పిచ్చొల్లులాగా వింటూనే పనిచేశాం. 

సినిమాలో ఏది బాగుందని ప్రశంసలు దక్కినా అది డైరెక్టర్ గొప్పతనమే. విజయంలోని క్రెడిట్‌ను తాను తీసుకోకుండా సుకుమార్‌ అందరికీ పంచిచ్చేస్తుంటాడు. కానీ,  ఈ విజయంలోని పూర్తి క్రెడిట్‌ తనకే సొంతం దేవిశ్రీ లేకుండా ‘పుష్ప’ను ఊహించడం చాలా కష్టం. తను ఈ సినిమాకు ఓ గొప్ప శక్తిని అందించాడు. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ, అదొక అద్భుతంలా అయితే ఉంటుంది (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)