Breaking News

ముగిసిన అల్లు అర్జున్‌ విచారణ

Published on Tue, 12/24/2024 - 09:23

చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో అల్లు అర్జున్‌ విచారణ ముగిసింది.  దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. అయితే పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బన్నీ తన కారులోనే ఇంటికి వెళ్లారు. ఆయన వెంట తండ్రి అల్లు అర్జున్‌ కూడా ఉన్నారు. 

కాగా,  సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో ఇదివరకే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకొచ్చిన బన్నీ.. మరోసారి విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తన లాయర్లతో భేటీ అయిన అల్లు అర్జున్.. వాళ్లతో కలిసి ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రానున్నాడు.

విచారణలో భాగంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి జరిగిన విషయాల గురించి పోలీసులు మాట్లాడుతారు. అలానే అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. ఇది విచారణ కాబట్టి మధ్యాహ‍్నానికి తిరిగి బన్నీ ఇంటికి వెళ్లిపోతాడు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)

అసలేం జరిగింది?
'పుష్ప 2' (Pushpa 2) మూవీ బెన్‌ఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కి (Sandhya Theatre) వెళ్లాడు. కానీ అక్కడ అభిమానుల మధ్య తోపులాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆస్పత్రిలో చేర్చారు. రేవతి భర్త ఫిర్యాదుతో తొలుత థియేటర్ ఓనర్, మేనేజర్, సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్‌ని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆ రాత్రికే బెయిల్ వచ్చింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ బన్నీని జైలు నుంచి ఉదయం రిలీజ్ చేశారు.

మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్

జైలు నుంచి విడుదలై ఇంటికెళ్లిన తర్వాత సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్‌ని పరామర్శించారు. తాజాగా ఆ విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిప్పులు చెరిగారు. ఆస్పత్రిలో ఉన్న పిల్లాడిని ఒక్కరు కూడా పరామర్శించలేదని, బన్నీని మాత్రం కలిశారని అన్నారు. తప్పంతా బన్నీదే అన్నట్లు రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్.. తానేం తప్పు చేయలేదని, ప్రమాదం వల్ల మహిళా చనిపోయిందని అన్నాడు. ఇప్పుడు పోలీసులు.. మరోసారి బన్నీని విచారణకు పిలవడం చర‍్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)