Breaking News

బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!

Published on Thu, 06/12/2025 - 11:06

అల్లు అర్జున్‌(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్‌ సెట్‌ గో... అంటూ అల్లు అర్జున్‌ చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తారు. మృణాల్‌ ఠాగూర్, జాన్వీ కపూర్‌ కూడా హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. 

కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్‌ ఠాగూర్‌ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్‌ చేశారని సమాచారం. 

ఈ షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను సైతం షూట్‌ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే ఈ తొలి షెడ్యూల్‌ షూటింగ్‌లో దీపికా పదుకోన్‌ పాల్గొనరట. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నారని, ఇందులో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)