Breaking News

బన్నీ-అట్లీ.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది

Published on Sat, 06/07/2025 - 11:03

'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అని ఎదురుచూసిన అభిమానులకు.. కొన్నిరోజుల క్రితం సమాధానమిచ్చేశాడు. తమిళ దర్శకుడు అట్లీతో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న నేపథ్యంలో పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఓ అప్‌డేట్ వచ్చేసింది. హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు.

ప్రభాల్ 'కల్కి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పదుకొణెని అల్లు అర్జున్‌కి జోడీగా ఎంపిక చేశారు. బన్నీకి ఈమెతో పనిచేయడం తొలిసారే. కానీ దర్శకుడు అట్లీ మాత్రం తన గత చిత్రం 'జవాన్'లో దీపికతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు బన్నీతో చేయబోయే మూవీలోనూ ఈమెని హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు.

గత కొన్నిరోజుల నుంచి దీపికా పదుకొణె వార్తల్లో నిలుస్తోంది. 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా ఈమెని అప్రోచ్ అయ్యాడు. దాదాపు సెట్ అనుకునే టైంలో ప్రాజెక్ట్ నుంచి దీపిక బయటకొచ్చింది. ఈ క్రమంలోనే స్టోరీని లీక్ చేయడం లాంటివి జరిగేసరికి సందీప్ వంగా.. ఈమె పేరు చెప్పకుండా పరోక్షంగా ట్వీట్ పెట్టాడు. మరోవైపు 8 గంటల షిఫ్ట్ కారణంగా 'కల్కి 2' నుంచి కూడా ఈమె తప్పుకోనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇలా కాంట్రవర్సీ పుకార్లకు కేరాఫ్ అయిన దీపిక.. బన్నీ-అట్లీ మూవీ విషయంలో ఏం చేస్తుందో చూడాలి?

దీపిక స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. కెరీర్ ప్రారంభం నుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. పద్మావత్, రామ్ లీలా తదితర చిత్రాలు ఈమె చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక తనతో పాటు కలిసి సినిమాలు చేసిన రణ్‌వీర్ సింగ్ ని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వీళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంది కానీ ఇప్పుడు మళ్లీ బిజీ కానుంది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)