Breaking News

రెడీ... సెట్‌... గో

Published on Fri, 07/19/2024 - 00:57

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ షూటింగ్‌కి రెడీ సెట్‌ గో అంటున్నారు మేకర్స్‌. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్‌’ (2021) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీకి సీక్వెల్‌గా సేమ్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది.

షెడ్యూల్‌ ప్రకారం చిత్రీకరణ పూర్తి అయ్యుంటే ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్‌ సకాలంలో పూర్తి కాకపోవడం.. క్వాలిటీ విషయంలో చిత్రయూనిట్‌ రాజీ పడకపోవడంతో ఈ మూవీని డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా షెడ్యూల్‌ విషయానికి వస్తే.. ఈ నెల 22 లేదా 25న ప్రారంభం అవుతుందట. ఈ నెల 28 నుంచి అల్లు అర్జున్‌ కూడా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. శరవేగంగా చిత్రీకరణ, పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులు పూర్తి చేసి, డిసెంబరు 6నే సినిమాని విడుదల చేయాలని మేకర్స్‌ ఫిక్స్‌ అయ్యారని భోగట్టా.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)