Breaking News

అల్లు అర్జున్‌ అంటే అంతే.. కొత్త దర్శకుడికి బిగ్‌ ఛాన్స్‌

Published on Fri, 06/13/2025 - 09:01

పుష్ప(Pushpa) తరువాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఆదరణ ఉండటంతో ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. త్రివిక్రమ్(Trivikram) సినిమాను  దాదాపు పక్కన పెట్టేసినట్లే అని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే బన్నీ లిస్ట్‌లో ప్రశాంత్‌ నీల్‌ ఉన్నారు. ఆయనతో ఒక ప్రాజెక్ట్‌ తప్పకుండా చేస్తారని టాక్‌ ఉంది. ఇంతలో ఎవరూ ఊహించలేని ఒక దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అట్లీ సినిమా తర్వాత తన దర్శకత్వంలోనే బన్నీ సినిమా అంటూ పెద్ద ఎత్తున్న వైరల్‌ అవుతుంది.

అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ ఎవరూ ఊహించలేని దర్శకుడితో సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా బన్నీ ఓకే చేశారట. మలయాళ హిట్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో బన్నీ సినిమా దాదాపు ఖరారు అయిపోయిందట. మలయాళంలో డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా కూడా ఆయన సంచలన విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మిన్నల్ మురళీ' (2021) చిత్రానికి తెలుగులో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే, దర్శకుడిగా ఆయన మూడు చిత్రాలకే పనిచేశారు. స్టోరీ రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. జయ జయ జయ జయహే, సూక్ష్మ దర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో ఆయన తెలుగు వారికి నటుడిగా బాగా దగ్గరయ్యాడు. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ జోసెఫ్‌తో బన్నీ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట భారీగా వైరల్‌ అవుతుంది.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్‌ ఒక సినిమా గురించి మాట్లాడారు. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ మూవీ కాదని కూడా  తెలిపాడు. ఎవరూ ఊహించలేని కాంబినేషన్‌ అని ఆయన అన్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మలయాళంలో అల్లు అర్జున్‌కు భారీ ఇమేజ్‌ ఉంది. దీంతో ఆయన మీద అభిమానంతో దాదాపు నాలుగేళ్లు కష్టపడి  ఒక కథను బాసిల్‌ రెడీ చేశారట. త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)