Breaking News

ఆగ్రాకి స్వాగతం

Published on Wed, 12/04/2024 - 03:56

అలీ ప్రధాన పాత్రలో ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’ అనే హిందీ సినిమా రూపొందుతోంది. ఆశిష్‌ కుమార్‌ దూబే రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్‌ ఫిలిమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’ సినిమాప్రారంభోత్సవంలో భాగంగా ముహూర్తపు సన్నివేశాన్ని ముంబైలో చిత్రీకరించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– ‘‘ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు. గతంలో సల్మాన్‌ ఖాన్‌ వంటి పలువురు హీరోల కాంబినేషన్‌లో హిందీలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’లో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేయనుండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఈ మూవీలో అన్షుమాన్‌ ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే, రౌనక్‌ ఖాన్, ఫైజల్‌ మాలిక్, అంచల్‌ గాంధీ, కైరా చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)