Breaking News

'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?

Published on Fri, 01/26/2024 - 15:05

ఇతడు తెలుగు నటుడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన 'సలార్' మూవీలోనూ గుర్తుంచుకోదగ్గ పాత్రలో అలరించాడు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. ఇతడికి ఆలందూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. నోటీసులు జారీ చేసేంతలా ఇతడు ఏం చేశాడా అని మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ ఏం జరిగింది?
ఆలందూర్‌కు చెందిన జేఎంఏ హుస్సేన్‌.. బాబీసింహపై కోటి రూపాయలు పరువు నష్టం దావా వేస్తూ ఆలందూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను బాబీసింహ స్నేహితులమని.. చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని పేర్కొన్నారు. జమీర్‌ కాశీం అనే వ్యక్తి.. తన ద్వారా బాబీసింహకు పరిచయమయ్యారని, అతడు భవన నిర్మాణ రంగంలో ఉన్నారని హుస్సేన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే బాబీసింహ.. కొడైక్కానల్‌లో నిర్మించే భవన నిర్మాణ బాధ్యతలను జమీర్‌ కాశీంకు అప్పగించారని చెప్పాడు. 

(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి)

అయితే 90 శాతం భవన నిర్మాణ పనులను పూర్తి చేయగా.. అప్పటివరకు అయిన ఖర్చుని బాబీసింహా చెల్లించలేదని.. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని హుస్సేన్ చెప్పాడు. దీంతో తన తండ్రి.. వాళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారని.. కానీ ఆ సమయంలో 77 ఏళ్ల తన తండ్రిని బాబీసింహ బెదిరించారని హుస్సేన్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్‌ 27న ప్రెస్ మీట్ పెట్టి మరీ తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఈ నేపథ్యంలో బాబీసింహపై తగిన చర్యలు తీసుకోవాలని హుస్సేన్.. ఆలందూర్ కోర్టులో పిటిషన్‌లో వేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం.. వివరణ కోరుతూ ప్రముఖ నటుడు బాబీసింహకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.

(ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)