Breaking News

రెండురోజులకే వదిలేస్తానంది.. నేనే ఒప్పించా: దర్శకుడు

Published on Sat, 03/30/2024 - 17:34

అళగి చిత్ర యూనిట్‌ అంతా కూడా 22 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఒకే వేదికపై కలవడం సంతోషంగా ఉందని నటి దేవయాని పేర్కొన్నారు. 2012లో విడుదలైన క్లాసికల్‌ లవ్‌స్టోరీ అళగి (ఇది తెలుగులో లేత మనసులుగా రీమేకైంది). నటుడు పార్తీపన్‌, దేవయాని, నందితాదాస్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తంగర్‌బచ్చన్‌ దర్శకత్వంలో ఉదయగీత ఫిలింస్‌ పతాకంపై ఉదయకుమార్‌ నిర్మించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది.

అదే అళగి చిత్రం 22 ఏళ్ల తరువాత శుక్రవారం (మార్చి 29న) రీరిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించింది. దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తుడడం, నటి నందితా దాస్‌ ముంబైలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. నటుడు పార్తీపన్‌, దేవయాని, నిర్మాత ఉదయకుమార్‌, ఇతర నటీనటులు పాల్గొన్నారు.

దేవయాని మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకున్న తరువాత నటించడానికి అంగీకరించిన మొదటి చిత్రం అళగి అని చెప్పారు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు తంగర్‌బచ్చన్‌ అడిగారన్నారు. ఎంత ప్రేమ ఉన్నా.. ఒక భార్య తన భర్తను వేరొకరితో పంచుకోవడానికి అంగీకరించని పాత్ర రూపకల్పన తనకు చాలా నచ్చిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించినట్లు చెప్పారు.

పార్తీపన్‌ మాట్లాడుతూ దర్శకుడు తంగర్‌బచ్చన్‌ మంచి కథారచయిత అని పేర్కొన్నారు. ఆయన కాకుండా వేరే ఎవరున్నా ఈ చిత్రం ఇంత విజయం సాధించి ఉండేది కాదన్నారు. షూటింగ్‌ ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం తనకు సెట్‌ కాదనిపిస్తోందని, తాను వైదొలగుతానని నటి నందితాదాస్‌ తనతో చెప్పారన్నారు. అయితే తాను చిత్రానికి సంబంధించిన సంభాషణలను వివరించి, ఆమె నటించేలా చేశానన్నారు. కాగా అళగి చిత్రానికి సీక్వెల్‌ చేయడానికి కథను రెడీ చేశానని, అయితే ఆ టైటిల్‌ను తంగర్‌బచ్చన్‌ తనకు ఇవ్వనన్నారని చెప్పారు. అందుకే ఆయన రాజకీయాల్లో స్థిరపడిపోతే తనకు అళగి 2 చిత్రం చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)