Breaking News

అలా ఇలా ఎలా సినిమా రివ్యూ

Published on Sat, 07/22/2023 - 13:30

టైటిల్‌: అలా ఇలా ఎలా
నటీనటులు:  పూర్ణ, శక్తి వాసుదేవన్, రాజా చెంబోలు, నాగబాబు, సితార, సీత, షాయాజీ షిండే, రేఖ
దర్శకుడు: రాఘవ ద్వారకి
నిర్మాత: జి.నాగరాజు
విడుదల తేది: 22 జూలై 2023

కథ
అను (పూర్ణ) అబద్దం అంటే సహించదు. అబద్దాలు ఆడదు, ఎవరైనా అబద్ధాలు ఆడి మోసం చేసినా అస్సలు ఊరుకోదు.. అలాంటి అను.. సూర్య (శక్తి వాసుదేవన్ )తో ప్రేమలో పడుతుంది. మరో వైపు కార్తీక్ (రాజా చెంబోలు) జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. అలా వచ్చిన కార్తీక్.. మిత్రను చంపాలని అనుకుంటాడు? అసలు కార్తీక్ జైలుకి ఎందుకు వెళ్తాడు? మిత్ర ఎవరు? సూర్య ఎవరు? అనుకి, కార్తీక్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆమెను మోసం చేసింది ఎవరు? చివరకు అను ఏం చేసింది? అన్నది కథ.

నటీనటులు
అను పాత్రలో పూర్ణ చాలా బాగా నటించింది. లుక్స్ పరంగానూ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమెకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. శక్తి వాసుదేవన్ భిన్న పార్శ్వాలను చూపించాడు. కార్తీక్ కారెక్టర్‌లో రాజా బాగానే మెప్పించాడు. నాగబాబు, బ్రహ్మానందం, అలీ సితార, సీత, షాయాజీ షిండే, రేఖ ఇలా అందరూ చక్కగా నటించారు. ప్రేమ కథల మీద ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని వచ్చినా కూడా కొత్త పాయింట్‌తో తెరకెక్కిస్తే దాన్ని జనాలు స్వీకరిస్తారు. ప్రేమ, మోసం అనే కాన్సెప్టుల మీద గతంలో బోలెడన్ని సినిమాలు వచ్చినా, ఇందులో దాన్ని కాస్త కొత్తగా చూపించినట్లనిపించింది.

విశ్లేషణ
ఇంటర్వెల్ వరకు ఒక సినిమాను చూపిస్తే.. తరువాత ఇంకో రకమైన సినిమాను చూపించినట్టు అయింది. ప్రథమార్దం ఫన్నీగా సాగుతుంది. బ్రహ్మానందం, అలీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. మొదటి భాగంలో కామెడీకి పెద్ద పీట వేస్తే రెండో భాగంలో మాత్రం కథ మీద దృష్టి సారించారు. సెకండాఫ్‌లో కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు కొంత సక్సెస్‌ అయ్యాడనే చెప్పవచ్చు. క్లైమాక్స్ అయితే ఎవరూ గెస్‌ చేయలేరు.

చివర్లో ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. సినిమాలో అక్కడక్కడా సాగదీసి బోర్‌ కొట్టించినా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మణిశర్మ పాటలు, సంగీతం మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇంకొన్ని సీన్లకు కత్తెర పడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)