Breaking News

టికెట్‌ కొంటే ఛాయ్, సమోసా ఫ్రీ.. కానీ సినిమాకి జనాలు రావట్లేదు!

Published on Mon, 07/15/2024 - 12:37

ఇప్పుడు కొత్త సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తయారైంది. కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినా సరే నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ లేటెస్ట్ మూవీకి తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంతలా అంటే ఏకంగా మల్టీఫ్లెక్స్‌లు టికెట్ కొంటే ఫుడ్ ఫ్రీ ఇచ్చేంతలా!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా'.. మూడు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చింది. అప్పుడెప్పుడో కరోనాలో నేరుగా ఓటీటీలో రిలీనైన సూర్య 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్ ఇది. ఆల్రెడీ రీమేక్‌ని చాలామంది చూసేయడం, రిలీజ్‌కి ముందు సరైన బజ్ లేకపోవడం 'సర్ఫిరా'కి ఘెరమైన మైనస్ అయ్యాయి. ఇదంతా వసూళ్లపై ప్రభావం పడింది.

ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు చూసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు 'సర్ఫిరా'తో మూడు రోజుల్లో కేవలం రూ.12 కోట్లు కలెక్షన్స్ రావడం షాకయ్యేలా చేసింది. దీంతో సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పీవీఆర్ మల్టీఫ్లెక్స్.. టికెట్ కొని 'సర్పిరా' చూస్తే సమోసా, ఛాయ్ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ పెట్టడం చూస్తుంటే జనాలు ఎలా మొహం చాటేస్తున్నారో అర్థమవుతోంది.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)