Breaking News

నా సినిమా ఫ్లాఫ్ అయితే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో

Published on Fri, 07/12/2024 - 18:18

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫీరా మూవీతో ప్రేక్షకులను పలరించాడు. ఈ చిత్రం సూర్య నటించిన సూపర్‌హిట్ మూవీ సూరారైపోట్రుకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా సుధా కొంగర దర్శకత్వం వహించారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్ఫీరా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా అక్షయ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు ఎలా ఉండాలో అమితాబ్‌ను చూసి నేర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 10న విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.
 

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా పనిచేసే వ్యక్తులను నేను చూశా. వారి సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ సినీ పరిశ్రమలో ఫ్లాప్‌లు వస్తే మనకు అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. కొందరు వ్యక్తులు నా సినిమాల వైఫల్యాలను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. కానీ నేను నా శ్రమను నమ్ముకున్నా. అయితే ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. అయితే నేను అమితాబ్‌ బచ్చన్‌ నుంచి ఓ విషయం నేర్చుకున్నా. ఫ్లాఫ్‌ వచ్చినా మన పనిని మాత్రం ఆపకూడదు. మన పనితో పాటు అదృష్టాన్ని నమ్ముకోవాలని ఆయన సలహా ఇచ్చారు.' అని అన్నారు. 

అయితే తాను ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్‌ హీరో అసహనం వ్యక్తం చేశారు. 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్ కోసం 80 రోజులు కేటాయించినట్లు అక్షయ్ కుమార్ వెల్లడించాడు. కాగా.. అక్షయ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్', 'రామ్ సేతు', 'రక్షా బంధన్', 'బచ్చన్ పాండే', 'సెల్ఫీ' బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)