Breaking News

టాయిలెట్‌ టైటిల్‌పై జయా బచ్చన్‌ విమర్శలు.. అక్షయ్ కుమార్ ఏమన్నారంటే?

Published on Fri, 04/11/2025 - 15:39

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం కేసరి-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని జలియన్‌వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు కరణ్ సింగ్‌ త్యాగి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేసరి-2 మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అక్షయ్ కుమార్‌. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో జయా బచ్చన్ తన సినిమా టైటిల్‌పై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' లాంటి టైటిల్‌ ఉంటే ఎవరైనా సినిమా చూస్తారా? అంటూ గతంలో జయా బచ్చన్‌ మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి పేరుతో ఉన్న సినిమాలను తాను అస్సలు చూడనని తెలిపింది.

దీనిపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ..' ఆ సినిమా టైటిల్ చూసి ఇప్పుడు ఆమె అలా చెప్పి ఉంటే అది తప్పకుండా అంగీకరించాల్సిందే. ఆ విషయం గురించి నాకు  కూడా తెలియదు. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంలో నేనేమైనా తప్పు చేసి ఉంటే.. జయా బచ్చన్‌ చెప్పింది కరెక్ట్. అయితే టైటిల్ చూసి ఎవరైనా అలా విమర్శలు చేస్తారని తాను అనుకోవడం లేదు." అని అన్నారు. కాగా.. అక్షయ్‌ కుమార్ నటిస్తోన్న 'కేసరి 2' సి శంకరన్ నాయర్ కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం జలియన్‌వాలాబాగ్ ఊచకోత. నాయర్ నేతృత్వంలోని పోరాటం అంశాలతో తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)