Breaking News

అక్షయ్‌ కుమార్‌ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Published on Sat, 08/19/2023 - 07:27

అక్షయ్ కుమార్ కీలక పాత్రలో అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓ మై గాడ్ 2'  ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. అయితే దీని కోసం అక్షయ్ కుమార్‌ భారీగా రెమ్యునరేషన్‌ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే  స్పందించారు.

ఈ సినిమా కోసం అక్షయ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు రూ.150కోట్లు వసూళ్లు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రను పోషించగా ఆయన భక్తుడిగా పంకజ్‌ త్రిపాఠి నటించారు. 

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్‌ తిరిగిచ్చేసిన మెగాస్టార్‌.. ఎంతో తెలుసా..?)

అక్షయ్‌ రెమ్యునరేషన్‌పై  'ఓమైగాడ్2' నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే ఇలా స్పందించారు 'ఈ సినిమా ప్రకటించిన సమయం నుంచి అక్షయ్‌ రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన భారీగా పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ సినిమా కోసం అక్షయ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాకు బడ్జెట్‌ విషయంలో లోటుపాట్లు ఉంటే ఆయనే ఆర్థికంగా సాయం చేశారు.

మా మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. 'ఓ మైగాడ్‌' మొదటి భాగం వచ్చినప్పటి నుంచి మేము కలిసి సినిమాలు తీస్తున్నాం.'  అని అన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో అక్షయ్‌ కూడా ఒకరని అజిత్ అంధరే తెలిపారు. కాబట్టి సినిమాకు వచ్చిన లాభాల్లో మాత్రమే ఆయనకు షేర్‌ ఉంటుందని చెప్పారు.


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)