Breaking News

‘సల్మాన్‌ అవమానించాడు’.. స్పందించిన అక్షయ్‌ కుమార్‌

Published on Tue, 01/21/2025 - 12:38

'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్‌ ఖాన్‌ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్‌మెంట్‌ల కారణంగానే గ్రాండ్‌ ఫినాలే షూటింగ్‌ ప్రారంభం కాకముందే షో  నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్‌ మీడియా వార్‌కి పుల్‌స్టాఫ్‌ పెట్టేశాడు.

అసలేం జరిగింది?
గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్‌బాస్‌ 18వ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్‌ ఫినాలేకి అతిథులుగా అక్షయ్‌ కుమార్‌, వీర్‌ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్‌ ఖాన్‌ మాత్రం ఆలస్యంగా సెట్‌కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్‌లోనే వేచి చూసిన అక్షయ్‌.. షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్‌ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్‌ సెట్‌కి వచ్చాడు. దీంతో అక్షయ్‌ కుమార్‌ను సల్మాన్‌ ఖాన్‌ అవమానించాడంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్‌ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.

వాస్తవం ఎంటంటే..?
సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్‌ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..  తనకున్న కమిట్‌మెంట్‌ కారణంగా షూటింగ్‌ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్‌ సెట్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్‌కు టైమ్‌ కావడంతో ఫినాలే షూట్‌ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్‌తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్‌’ను ప్రచారం చేయడం కోసం వీర్‌ పహారియా బిగ్‌బాస్‌ సెట్‌లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్‌ అన్నారు.

బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? 
బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్‌ విన్నర్‌((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్‌ వీర్‌ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్‌ డిసేన ఫస్ట్‌ రన్నరప్‌గా, యూట్యూబర్‌ రజత్‌ దలాల్‌ సెకండ్‌ రన్నరప్‌గా  నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్‌ 6లో చోటు సంపాదించుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)