ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్ట్
Published on Sat, 04/25/2026 - 09:20
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను వేధించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం సైబర్ నేరాల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన కుటుంబంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని ప్రపంచానికి తెలిపారు.
ఏం జరిగిందంటే..?
13 ఏళ్ల తన కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గతంలో మీడియాతో ఆయన పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన ఇలా తెలిపారు. 'నా కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ధైర్యంగా వెళ్లి నా భార్యతో చెప్పింది. ' అని గుర్తుచేసుకున్నారు.
అక్షయ్ కుమార్తె నిటారపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు లోనై చాలామంది పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు. తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోనని సంకోచిస్తారు. కానీ, అక్షయ్ కుమార్తె తను ఎదుర్కొన్న వేధింపుల గురించి తల్లితో పంచుకుని మంచిపని చేసిందని సోషల్మీడియాలో చాలామంది కొనియాడారు. ఆమె ధైర్యానికి ఫిదా అయ్యారు.
Tags : 1