Breaking News

బాక్సాఫీస్‌ డిజాస్టర్స్‌.. ఆకలిని పెంచుతాయి: స్టార్‌ హీరో

Published on Wed, 07/24/2024 - 13:42

సెట్‌లో పని చేసే బాయ్స్‌ నుంచి హీరోలదాకా అందరూ సినిమా కోసం ఎంతగానో కష్టపడతారు. ప్రేక్షకులు ఆనందించేలా ఉండాలని తహతహలాడతారు. కానీ అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేవు. కొన్నిమాత్రమే సినీప్రియుల మెప్పు పొందుతాయి. అలా ఇటీవలి కాలంలో మూవీ లవర్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌. వందల కోట్ల కలెక్షన్స్‌ కొల్లగొట్టే ఈ హీరో ఈ మధ్య కాలంలో హాఫ్‌ సెంచరీ కూడా కొట్టలేదు. 

వరుస వైఫల్యాలు
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన బడే మియా చోటే మియా, లేటెస్ట్‌ రిలీజ్‌ సర్ఫిరా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. వరుస అపజయాలతో అక్షయ్‌ ఒకింత నిరాశకు లోనయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి సినిమా వెనక ఎంతో కష్టం దాగి ఉంటుంది. అలాంటిది ఏదైనా చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అయిందంటే ఎవరికైనా మనసు ముక్కలవుతుంది.

ఫెయిల్యూర్స్‌తో బాధ
కానీ ఈ ఫెయిల్యూర్స్‌ గుణపాఠాలు నేర్పుతాయి. సక్సెస్‌ ఎంత అవసరమనేది గుర్తుచేస్తాయి. విజయాన్ని అందుకోవాలనే ఆకలిని పెంచుతాయి. అదృష్టవశాత్తూ కెరీర్‌ ప్రారంభంలోనే జయాపజయాలను ఎలా డీల్‌ చేయాలనేది నేర్చుకున్నాను. అయినప్పటికీ ఫెయిల్యూర్స్‌ మనసుకు కొంత బాధను, మనపై కొంత ప్రభావాన్ని కలుగజేస్తాయి. 

అయినా తగ్గను
అయినా మనం సినిమా తలరాతను మార్చలేం. దాని ఫలితాలు మన చేతిలో ఉండవు. కేవలం సినిమా కోసం ఎంత కష్టపడతాం, ఎంత అద్భుతంగా మలుస్తామనేది మాత్రమే మన నియంత్రణలో ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. సర్ఫిరా విషయానికి వస్తే.. సూరరై పోట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) అనే తమిళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.21 కోట్లు రాబట్టింది.

చదవండి: హీరో బర్త్‌డే.. సంతోషమే లేకుండా పోయింది!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)