Breaking News

రెండుసార్లు పరీక్షలు రాశాను.. అయినా ఫెయిల్‌ కావడంతో..: అక్షర

Published on Fri, 07/12/2024 - 15:45

చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది. అయితే చదువు లేకపోతే జీవితమే లేదు అనుకోవడం కూడా సరికాదు. పెద్దగా చదువుకోని వారు కూడా జీవితంలో అనుకున్నది సాధించారు, సాధిస్తున్నారు. ఎవరి దాకో ఎందుకు అంబానీ వంటి వారి గురించి కాకుండా, మనందరికీ స్ఫూర్తిదాయకుడు అయిన లోకనాయకుడిగా పిలవబడుతున్న నటుడు కమలహాసన్‌నే తీసుకుంటే ఆయన ఉన్నత విద్య చదువుకోలేదు. ఆయన జీవితమనే పాఠశాలలో చదువుకుంటూ తనే ఒక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతున్నారు. పలు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాషను అద్భుతంగా మాట్లాడగలరు.

ఇక ఆయన రెండో వారసురాలు అక్షరహాసన్‌ కూడా చదువులో కాస్త వెనుకే ఉండేవారు. కమలహాసన్, సారిక దంపతుల వారసులు శ్రుతిహాసన్, అక్షరహాసన్‌. అక్షరహాసన్‌ కమలహాసన్‌ ముద్దుల కూతురు. ఈమె నటిగా మారింది ఎలా అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకు చదువు పెద్దగా అబ్బలేదన్నారు. తాను పది ఫెయిల్‌ అని, రెండు సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత కాలేకపోయానని చెప్పారు. దీంతో తనకు చదువుపై ఆసక్తి లేదని తన తండ్రితో చెప్పానన్నారు. మరో విషయం ఏమిటంటే తన తండ్రి పెద్దగా చదువుకోలేదని, తల్లి సారిక కూడా చిన్న వయసు నుంచే నటించడంతో ఉన్నత చదువులు చదువుకోలేదని చెప్పారు.  తాను డాన్స్‌పై ఆసక్తితో సింగపూర్‌ వెళ్లి అక్కడ పరీక్ష రాసి నాట్య కళాశాలలో చేరానన్నారు. 

అయితే దాన్ని కొనసాగించలేకపోయానన్నారు. తరువాత తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలీవుడ్‌లో నటించడానికి ప్రయత్నించానని, అయితే అక్కడ పలు అవకాశాలు మిస్‌ చేసుకోవడంతో తిరిగి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చినట్లు చెప్పారు. అలా అజిత్‌ కథానాయకుడిగా నటించిన వివేకం చిత్రం ద్వారా నటిగా పరిచయమైనట్లు చెప్పారు. ఆ తరువాత విక్రమ్‌ హీరోగా నటించిన కడియారం కొండాన్‌ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినట్లు చెప్పారు. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్నట్లు అక్షరహాసన్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరింతగా శ్రమిస్తానన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)