ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
కమల్ హాసన్ చిన్న కూతురు.. 10th మూడుసార్లు ఫెయిల్.. అయినా తగ్గలేదు..
Published on Fri, 10/02/2026 - 19:53
సినీ కుటుంబంలో పుట్టినంత మాత్రాన జీవితం పూలబాటలా ఉండదని నటి అక్షర హాసన్ చెబుతున్నారు. కమల్ హాసన్ చిన్న కుమార్తెగా, శ్రుతి హాసన్ సోదరిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. తన కెరీర్ ప్రయాణం మాత్రం అందరిలా సాగలేదని ఆమె తెలిపారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అక్షర.. తన కెరీర్, చదువు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా
సాధారణంగా స్టార్ కిడ్స్ అంటే నటనతోనే సినీ రంగంలోకి అడుగుపెడతారని చాలామంది భావిస్తుంటారు. అయితే అక్షర హాసన్ మాత్రం మొదట డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. స్నేహితుల మ్యూజిక్ వీడియోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత దర్శకత్వంపై ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నటిగా మారడం కూడా ముందుగా తీసుకున్న నిర్ణయం కాదని.. ప్రయత్నించకుండా ఆ అవకాశాన్ని తిరస్కరించడం ఎందుకని భావించి నటనలోకి వచ్చినట్లు తెలిపారు.
భవిష్యత్తులో మెగాఫోన్ పడతా..
తనకు మొదటి నుంచీ దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఉందని అక్షర చెప్పారు. ‘నా మొదటి ఉద్యోగం నటన కాదు.. అసిస్టెంట్ డైరెక్టర్ పని అంతకంటే కాదు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత డైరెక్షన్ చేయాలనే లక్ష్యంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ప్రయత్నించకుండా వద్దని ఎలా చెబుతాం అనే ఉద్దేశంతోనే నటనలోకి అడుగుపెట్టాను. భవిష్యత్తులో కచ్చితంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తాను’ అని ఆమె తెలిపారు.
10వ తరగతిలో మూడుసార్లు ఫెయిల్..
అక్షర తన విద్యాభ్యాసం గురించి కూడా ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడారు. హైస్కూల్ చదువుల్లో తాను అనుకున్నంతగా రాణించలేకపోయానని చెప్పారు. 10వ తరగతి పరీక్షల్లో వరుసగా మూడుసార్లు ఫెయిల్ కావడంతో చదువుపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందని వెల్లడించారు. ఇక చదువులో పాస్ కావడం కష్టమని భావించి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసినట్లు తెలిపారు.
తల్లిదండ్రులు ఒత్తిడి చేయలేదు
కమల్ హాసన్, సారిక వంటి ప్రముఖ నటుల కుమార్తె అయినప్పటికీ.. తాము తప్పనిసరిగా నటులుగా మారాలని తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని అక్షర చెప్పారు. తమకు నచ్చిన రంగంలో కెరీర్ ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపారు. నటనపై ఆసక్తి లేకపోతే మరో రంగంలో స్థిరపడాలని చెప్పేవారని వెల్లడించారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి స్పెషల్.. ఓటీటీలో చూడాల్సిన 5 సినిమాలు
ఇక ఇంట్లో సినిమాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడుకుంటామని అక్షర చెప్పారు. తన నటన నచ్చకపోతే తల్లిదండ్రులు ముఖం మీదే చెబుతారని, ‘‘చాలా చెత్తగా నటించావు’’ అని కూడా చెప్పడానికి వెనుకాడరని తెలిపారు. చిన్న చిన్న తప్పులను తామే గుర్తించి వాటి నుంచి నేర్చుకునేలా ప్రోత్సహిస్తారని వెల్లడించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి..
అక్షర హాసన్ తొలుత 2010లో రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సొసైటీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రంలో ఆమె తల్లి సారిక నటించారు. అనంతరం కమల్ హాసన్ తెరకెక్కించిన ‘శభాష్ నాయుడు’ చిత్రానికి కూడా సహాయ దర్శకురాలిగా పనిచేశారు. 2015లో ఆర్.బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘షమితాభ్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంతరం అజిత్ కుమార్ సరసన ‘వివేగం’ సినిమాలో నటించారు. ఇటీవల ‘సిమ్యులాక్రా’ చిత్రంలోనూ కనిపించారు.
ఇదీ చదవండి: ‘మాకు పిల్లలు వద్దు.. ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి’
Tags : 1