Breaking News

నాన్న చివరి కోరిక నెరవేర్చిన నాగార్జున.. అదేంటంటే?

Published on Mon, 08/18/2025 - 16:39

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్‌ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.151 కోట్లు రాబట్టిన కూలీ.. కోలీవుడ్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

అయితే తాజాగా ఓ టాక్‌ షోకు హాజరైన నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అడిగిన కోరికను నెరవేర్చారు. మనం సినిమాలో తన పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించవద్దని అడిగారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. అలా చేస్తే అస్సలు ఊరుకోను అన్నారని వెల్లడించారు. ఆయన కోరిక మేరకే బెడ్ మీద నుంచే డబ్బింగ్‌ మొత్తం పూర్తి చేశారని తెలిపారు. నా జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేదని.. కానీ మనం సినిమా గురించి రాత్రిళ్లు నిద్రలేకుండా ఆలోచించేవాడినని నాగార్జున పేర్కొన్నారు. అప్పటికే ఆయనకు సినిమా చూపిస్తే.. చాలా బాగుందిరా అని అన్నారని నాగ్ పంచుకున్నారు.

నాగార్జున మాట్లాడుతూ..'మనం సినిమా మాకు చాలా స్పెషల్. ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్రేమ్‌లో కనిపించాం. ఇది నాన్నగారి చివరి చిత్రమని మాకు షూటింగ్‌లోనే తెలిసిపోయింది. ఆయనకు క్యాన్సర్‌ రావడంతో అదే చివరి సినిమా అని మా అందరికీ తెలుసు. నాకు లైఫ్‌లో ఎలాంటి ఒత్తిడి లేదు.. కానీ రాత్రిళ్లు నిద్రపోకుండా ఆలోచించింది మాత్రం ఈ ఒక్క సినిమానే. డబ్బింగ్‌ వేరేవాళ్లతో చెప్పిస్తే ఊరుకోను.. నేనే చెప్తా అన్నారు. ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్‌ మీద నుంచే సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆయన పాత్రకు తన సొంత వాయిస్‌తోనే డబ్బింగ్‌ చెప్పుకున్నారు. అప్పటికే నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అన్నారని' గుర్తు చేసుకున్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)