ఎన్టీఆర్ ఇంట్లో మీట్.. అఖిల్ బిగ్‌ ప్రాజెక్ట్‌ కోసమేనా?

Published on Mon, 12/08/2025 - 15:02

సినిమాల్లో కేవలం స్టార్‌డమ్ ఉంటే చాలదు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా ఉండాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీలో సక్సెస్‌ కావాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు కొంతవరకు బెనిఫిట్ ఉన్నప్పటికీ.. అది పూర్తిస్థాయిలో రావాలంటే సొంతం పనిమీదే ఆధారపడి ఉంటుంది.

అలా టాలీవుడ్‌ అగ్రకుటుంబం నుంచి వచ్చిన అఖిల్‌ అక్కినేనికి సరైన హిట్‌ పడడం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్‌ మూవీ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో మంచి కమ్ బ్యాక్‌ ఇచ్చేందుకు అఖిల్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న యాక్షన్  లవ్‌స్టోరీ చిత్రం లెనిన్ . ఈ మూవీకి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగానే అఖిల్‌కు సంబంధించి మరో టాక్‌ వినిపిస్తోంది. లెనిన్‌తో బిజీగా ఉన్న అఖిల్ మరో క్రేజీ ప్లాన్ చేస్తున్నారని చర్చ మొదలైంది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్‌ ఇంట్లో ప్రశాంత్ నీల్‌తో అఖిల్ మీట్ అయినట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో అఖిల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్లో సమావేశమైనట్లు సమాచారం.

అయితే ప్రశాంత్‌ నీల్‌ వద్ద పనిచేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌తోనే ఈ మూవీ ప్లాన్‌ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ నీల్‌  పర్యవేక్షణలోనే చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లెనిన్ ఈ మూవీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అఖిల్ ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్ తెప్పించే న్యూస్ ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
 

 

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)