Breaking News

ఆ విషయం తెలిశాక అమ్మ ఎమోషనల్‌ అయ్యింది : అఖిల్‌

Published on Sun, 04/23/2023 - 08:21

‘‘30 ఏళ్లకు పైగా మా నాన్నగారు (నాగార్జున) ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఆయనకు మంచి గ్రిప్‌ ఉంది. నాకేమైనా సందేహాలు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అయితే ఫలానా స్క్రిప్ట్‌ ఓకే చేయలా? వద్దా అని అడగను. అలా చేస్తే నా కెరీర్‌ తాలూకు ఒత్తిడిని నాన్నపై పెట్టినట్లు ఉంటుంది.
ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంటే ఓ వ్యక్తిగా నేను ఎదగలేకపోవచ్చు. అందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ కారణంగానే ‘ఏజెంట్‌’ స్క్రిప్ట్‌ను నాన్నతో షేర్‌ చేయలేదు’’ అన్నారు అఖిల్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటింన చిత్రం ‘ఏజెంట్‌’. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మింన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా అఖిల్‌ చెప్పిన విశేషాలు.

ఆ ఒక్క సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నా! 

♦ నాకు యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ టైమ్‌లో సూరిగారు (సురేందర్‌ రెడ్డి) ‘ఏజెంట్‌’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్‌ చేశాం. అయితే స్క్రిప్ట్‌ పూర్తి కావడానికి, నా లుక్‌ మార్చుకోవడం, లాక్‌డౌన్‌ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది.

♦ ‘ఏజెంట్‌’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్‌’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్‌ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్‌ ట్యూన్‌ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్‌గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్‌లో వచ్చే టార్చర్‌ సీన్‌ కోసం చాలా కష్టపడ్డాను.

♦సాధారణంగా నేను సెంటిమెంట్స్‌ను నమ్మను. అయితే ఏప్రిల్‌ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్‌ సినివలు విడుదలైన ఏప్రిల్‌ 28న ‘ఏజెంట్‌’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్‌ను మాత్రం ఫాలో అవుతున్నాను.

♦నాన్నగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్‌ ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. ‘ఏజెంట్‌’ సినిమా ట్రైలర్‌ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్‌ అయ్యారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)