Breaking News

ఏజెంట్‌ నన్ను పూర్తిగా మార్చేసింది: అఖిల్

Published on Sat, 04/15/2023 - 21:37

అక్కినేని అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏజెంట్‌’. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్‌ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్‌ కంప్లీట్‌ డిఫరెంట్‌ మేకోవర్‌ లుక్‌లో కనిపించనున్నారు.  తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అఖిల్‌ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్‌ మూవీ ట్రైలర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రెస్‌ మీట్‌లో అఖిల్ మాట్లాడుతూ.. 'ఇది రెండేళ్ల జర్నీలో ఏజెంట్‌ నన్ను పూర్తిగా మార్చేసింది. ఈ జర్నీలో సగటు మనిషిగా నేను అలసిపోయా. అయితే సినిమాకు ఏం కావాలో అది చేశానన్న  ఆనందం ఉంది. ఈ సినిమాతో మానసికంగా దృఢంగా మారిపోయా. ఒక నటుడిగా సరికొత్త ఫేజ్‌లోకి వచ్చాను. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మమ్ముటి సర్‌తో నటించడం నా అదృష్టం. ఆయన విలువ చాలా గొప్పది. నాలో స్ఫూర్తి నింపారు. చాలా విషయాలు నేర్చుకున్నా. నాకు యాక్షన్‌ జోనర్‌ అంటే ఇష్టం. అందుకే కథ చెప్పగానే కమిట్ అయిపోయా' అని అన్నారు.

కాగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌, పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)