Breaking News

హిందీ మార్కెట్‌లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్

Published on Tue, 12/16/2025 - 10:52

తెలుగు సినిమాలు బాలీవుడ్‌ మార్కెట్‌ను శాసించే రేంజ్‌కు చేరుకున్నాయి. పుష్ప2,కల్కి, కార్తికేయ2, హనుమాన్‌ వంటి సినిమాలు అక్కడ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్‌గా మిరాయ్‌ కూడా హిందీ ప్రేక్షకులను మెప్పించింది. దక్షిణాది కంటే హిందీ బెల్ట్‌లోనే మైథలాజికల్ కాన్సెప్ట్‌ సినిమాలు బాగా రన్‌ అవుతాయి. అందుకే  మహావతార్ నరసింహ లాంటి  యానిమేషన్‌ చిత్రం కూడా కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ, అఖండ2 మాత్రం హిందీ మార్కెట్‌లో టోటల్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ మధ్య హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి కూడా ఇంతే.. అసలు ఆ సినిమా హిందీలో విడుదలైన విషయం కూడా జనాలకు తెలియదు.

అఖండ్‌ హిట్‌.. సీక్వెల్‌ ఫట్‌
అఖండ పార్ట్‌-1 హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాక  హిందీలో భారీ హిట్‌ అయింది.  ఈ సినిమా తప్పకుండా చూడండి అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు కూడా షేర్‌ చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్‌కు హిందీలో కూడా అదే ఆదరణ లభిస్తుందని మేకర్స్ విశ్వసించారు. ఈ నమ్మకంతోనే  దర్శకుడు బోయపాటి శ్రీను కూడా నార్త్‌  ప్రేక్షకులపై ఆశలు పెట్టుకుని అఖండ 2ని రూపొందించారు. ఈ క్రమంలోనే శివుని తాండవం, హనుమంతుడి స్వరూపంతో పాటు భక్తి వంటి అంశాలను చేర్చడం.. ఆపై సనాతన ధర్మం,  దేశభక్తి వంటి అంశాలను కథ డిమాండ్‌కు మించి చేర్చారు. కథలో బలం ఉండి దానికి ఈ అంశాలు  జోడిస్తే అక్కడ కూడా బాక్సాఫీస్‌ వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించేవి. కానీ, ప్రస్తుతం హిందీలో అఖండ2 పేలవమైన కలెక్షన్స్‌తో నిరాశపరిచింది.

ప్రెస్ మీట్ ఖర్చులు కూడా రాలేదు
మొదటిసారిగా, నందమూరి బాలకృష్ణ కూడా హిందీ వెర్షన్‌ను చురుకుగా ప్రమోట్ చేశారు, కొన్ని హిందీ యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉత్తర భారత మార్కెట్‌తో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యం బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి చాలా కష్టపడ్డారు. అయితే, వారి వ్యూహం ఫలించలేదు. ఆపై అఖండ 2 తెలుగులో కూడా పేలవమైన ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ఉత్తర అమెరికా మార్కెట్‌లో నిరాశపరిచే విధంగా మొదటిరోజు కలెక్షన్స్‌ వచ్చాయి. దీంతో హిందీ వెర్షన్ నుండి అంచనాలు త్వరగా తగ్గిపోయాయి. హిందీ-డబ్బింగ్ విడుదల పూర్తిగా వాష్‌అవుట్‌గా నిరూపించబడింది.  

మొదటి మూడు రోజుల్లో, హిందీ వెర్షన్ కేవలం రూ. 35 లక్షలు మాత్రమే వసూలు చేసిందని నివేదించబడింది. కనీసం ముంబై ప్రెస్ మీట్ ఖర్చులను కూడా అఖండ రాబట్టలేదని కథనాలు వచ్చాయి. తమిళం, కన్నడ వంటి ఇతర భాషలలో ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కొంతవరకు ఊహించినప్పటికీ, హిందీలో దారుణమైన స్పందన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ ఇద్దరికీ పెద్ద షాక్ ఇచ్చింది.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)