Breaking News

'అఖండ-2' ఫైనల్‌ కలెక్షన్స్‌.. బిగ్‌ లాస్‌

Published on Mon, 01/05/2026 - 11:27

'అఖండ 2' సినిమా భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్‌ లెక్కలను ఎప్పటికప్పుడు ప్రకటించే పలు ట్రేడ్‌ వర్గాల ప్రకారం ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. బాలకృష్ణ - బోయపాటి శీనుది హిట్‌ కాంబినేషన్‌.. వీరిద్దరూ కలిసి గతంలో తెరకెక్కించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో అఖండ-2పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌ పెట్టారని తెలుస్తోంది. అయితే, సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో ఊహించని రేంజ్‌లో నష్టాలు తప్పలేదు.

రూ. 100 కోట్ల నష్టం
'అఖండ 2'కు సినిమా టికెట్ల పెంపునకు ఇరు రాష్ట్రాల్లో ఛాన్స్‌ దక్కింది. కానీ, లాభాలు రాలేదు. నష్టాలే తెచ్చిపెట్టింది. 2025లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌ను  14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 'అఖండ 2' వికీపీడియా ప్రొఫైల్‌లో కూడా ఇదే ఉంది. అయితే, ప్రస్తుతం అఖండ-2 కలెక్షన్స్‌ దాదాపు క్లోజింగ్‌కు వచ్చేసింది. చాలాచోట్ల ఇప్పటికే సినిమాను తొలగించేశారు కూడా... మరో మూడురోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి వుంది కాబట్టి పూర్తిగా అఖండ-2ను తప్పించడం సహజం. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్‌ రాబట్టినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిల్‌ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది.

సినిమాకు మొదట మిక్స్ డ్ టాక్ రావడంతోనే కలెక్షన్స్‌పై ఎక్కువ ప్రభావం చూపింది. అయితే, అభిమానులకు విపరీతంగా నచ్చిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్‌ జనాలకు అంతగా కనెక్ట్‌ అవలేదు.

ఆశగా ఎదురుచూస్తున్న బయ్యర్లు
అఖండ 2 సినిమాను బిజినెస్ పరంగా చూడకూడదని దర్శకుడు బోయపాటి కొద్దిరోజుల క్రితం కామెంట్‌ చేశారు. ఈ మూవీకి డబ్బుల సమస్య లేదంటూనే.. కావాల్సినంత కలెక్షన్స్‌ ఎప్పుడో వచ్చేసాయని అన్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్ష్‌ కూడా మా డైరక్టర్ చెప్పారు.. అఖండ -2 డబ్బులు ఎప్పుడో వచ్చేశాయి.. నష్టాలు ఏమీ లేవంటూ సంబరపడుతూ పోస్టులు పెడుతున్నారు. కానీ, బయ్యర్ల పరిస్థితిని తెలుసుకుంటే చాలా దారుణంగా వుంది. అఖండ-2కు సంబంధించి జిఎస్టీలు ఇస్తే కాస్తయినా నష్టాలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)