Breaking News

అజిత్‌కి జోడీగా...

Published on Sat, 06/14/2025 - 05:12

స్టార్‌ హీరో అజిత్‌కి జోడీగా శ్రీనిధీ శెట్టి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. యశ్‌ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు శ్రీనిధీ శెట్టి. ఆ సినిమాపాన్‌ ఇండియా హిట్‌ కావడంతో ఈ బ్యూటీకి ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’, తమిళ చిత్రం ‘కోబ్రా’ మంచి విజయాలు సాధించాయి. నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు శ్రీనిధి.

ఈ చిత్రంలో తనదైన నటన, యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... అజిత్‌ కుమార్‌తో నటించే క్రేజీ చాన్స్‌ను శ్రీనిధి అందుకున్నట్లు టాక్‌. అజిత్‌ నటిస్తున్న 64వ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.

అజిత్‌తో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ వంటి సినిమా తెరకెక్కించిన అధిక్‌ రవిచంద్రన్‌ ‘ఏకే 64’ (వర్కింగ్‌ టైటిల్‌)కి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ నవంబరులో ఆరంభం అవుతుందట. 2026 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి... అజిత్‌కి జోడీగా శ్రీనిధి నటిస్తారా? లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)