Breaking News

త్రిషకు షాక్‌! తెరపైకి కాజల్‌ అగర్వాల్‌?

Published on Sat, 01/07/2023 - 08:13

సినిమా రంగంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నటుడు అజిత్‌ కొత్త చిత్రం విషయంలోనూ అదే జరుగుతున్నట్లు సమాచారం. ఈయన కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్‌కు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో తన 62వ చిత్రానికి అజిత్‌ రెడీ అవుతున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించబోతోంది. నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దాదాపు ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార నటించనున్నట్లు టాక్‌ వచ్చింది. అయితే ఇందులో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీని రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి అజిత్, నయనతారలది హిట్‌ కాంబినేషన్‌. ఇంతకు ముందు ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈ జంట నటించి మెప్పించింది.

ఆ విషయం పక్కన పెడితే అజిత్‌ 62వ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. దీంతో కాజల్‌ అగర్వాల్‌ ఎంపిక చేసినట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. ఈమె ఇంతకుముందు వివేకం చిత్రంలో అజిత్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. అజిత్‌కు జంటగా నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్, కమలహాసన్‌ సరసన ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది.   

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)