Breaking News

స్టార్ హీరో రెండు సినిమాలూ సంక్రాంతికే విడుదల

Published on Fri, 11/29/2024 - 09:58

సంక్రాంతి లాంటి పండగని స్టార్ హీరోలు వదులుకోవాలని అనుకోరు. ఇ‍ద్దరు ముగ్గురు హీరోలైనా సరే తమ సినిమాల్ని రెడీ చేస్తారు. తెలుగులో అయితే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలతో రాబోతున్నారు. తమిళంలో ఈసారి కొత్త మూవీస్ ఏమున్నాయా అని చూస్తే ఒకే స్టార్ హీరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పి అభిమానుల్ని తికమక పెడుతున్నారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)

తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఈ మధ్య నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. అజిత్ మరో మూవీ 'విడాముయార్చి' కూడా సంక్రాంతికే వస్తున్నట్లు చెప్పి షాకిచ్చారు.

గురువారం రాత్రి 'విడాముయార్చి' టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ కూడా వెరైటీగా బాగానే ఉంది. కానీ పొంగల్ రిలీజ్ అని చివర్లో చెప్పడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అజిత్ నుంచే రెండు సినిమాలు, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా పంతానికి పోయి ఇద్దరూ తమ మూవీస్ తీసుకొస్తారా అనేది చూడాలి? ఒకవేళ ఏది రిలీజైనా సరే 'గేమ్ ఛేంజర్' తమిళ వెర్షన్‌కి థియేటర్ల సమస్య మాత్రం గ్యారంటీ.

(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)