Breaking News

అజిత్‌ ఆశీర్వాదం తీసుకున్న హీరో శింబు

Published on Wed, 12/10/2025 - 08:47

సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్‌ హీరో అజిత్‌కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్‌ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. 

ఫేవరెట్‌ హీరోను కలిసిన శింబు
అజిత్‌ సినిమాలతోపాటు కార్‌ రేస్‌లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్‌ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్‌ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్‌ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.

ఆశీర్వాదం
శింబు తాజాగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో అరసన్‌ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్‌కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్‌, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్‌తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

ఆ డైరెక్టర్‌తో వన్స్‌ మోర్‌
అజిత్‌ మలేషియాలో జరుగుతున్న కార్‌ రేస్‌ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే!

 

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)