Breaking News

రాజ రాజ చోళుడిగా అజిత్‌?

Published on Wed, 09/13/2023 - 08:01

తమిళసినిమా: నటుడు అజిత్‌ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారా? రాజరాజ చోళుడు పాత్రను పోషించనున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు కోలీవుడ్‌ వర్గాల్లో అవుననే సమాధానమే రావడం విశేషం. ఇటీవల చారిత్రక కథాచిత్రాలు నడుస్తుందని చెప్పవచ్చు. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 చిత్రాలు సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్‌ అయిన విషయాన్ని చూశాం. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు.

చాలా కాలం క్రితమే దివంగత నడిగర్‌ తిలకం శివాజీ గణేషన్‌ రాజ రాజ చోళన్‌ చిత్రంలో తన గంభీరమైన నటనా కౌశలంతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. కాగా తాజాగా బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్‌ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్‌తో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి సమయంలో నటుడు అజిత్‌ కూడా చారిత్రక కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత రాజరాజ చోళన్‌ కథా చిత్రంలో నటించిన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అజిత్‌, విష్ణువర్దన్‌ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్‌ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ బంధువు ఒకరికి చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యారని సమాచారం. అదే విధంగా అజిత్‌ తన 62వ చిత్రం విడాముయిర్చి చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత రాజ రాజ చోళుడుగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)