Breaking News

హద్దులు మీరిన అభిమానం.. థియేటర్లోనే అరాచకం!

Published on Thu, 02/06/2025 - 16:48

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిత్ తిరుమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో తలా అంటూ ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ అభిమాన హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

రిలీజ్‌ మొదటి రోజు కొందరు ఫ్యాన్స్‌ మాత్రం ఓవరాక్షన్‌ చేశారు. ఏకంగా థియేటర్ లోపల బాణాసంచా పేల్చి అరాచకం సృష్టించారు. మరికొందరు అభిమానులైతే థియేటర్ వెలుపల పోలీసులతో గొడవపడ్డారు. కొందరు ఫ్యాన్స్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అగ్నిప్రమాదం జరిగి ఉంటే..

అజిత్ కుమార్‌ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు. థియేటర్ వెలుపల బాణాసంచా కాల్చి సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మీ అందరి ప్రాణాలు పోయేవని హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా హీరోపై అభిమానం ఉండాలే కానీ.. అది ప్రాణాలు తీసేలా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)