Breaking News

డిజాస్టర్‌ దిశగా అజిత్‌ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published on Thu, 02/13/2025 - 13:30

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌ ఇటీవలే విడాముయర్చి (తెలుగులో పట్టుదల) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌పై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోవడంపై విఫలమైంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విడాముయర్చి అధిగమించలేకపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించారు. 

ఈ మూవీ రిలీజైన వారం రోజులైనా కేవలం రూ.రూ. 71.3 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఏడో రోజు కేవలం  రూ. 2.50 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో వందకోట్ల నెట్ వసూళ్లు సాధించాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి రెండో వారంలోనైనా విడాముయర్చికి కలిసొస్తుందేమో చూడాలి. అయితే ఈనెల 14న లవర్స్ ‍డే రోజున మరిన్ని కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. దీంతో ఈ సినిమాకు తీవ్రమైన పోటీ తప్పేలా లేదు

కాగా.. ఈ సినిమాను భారీ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్  బ్యానర్‌లో తెరకెక్కించారు.  1997 అమెరికన్ చిత్రం బ్రేక్‌డౌన్ ఆధారంగా విడాముయర్చిని రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ అంతా అజర్‌ బైజాన్‌లో జరిగింది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణియన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి