Breaking News

అజిత్ 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'.. థియేటర్లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్!

Published on Mon, 04/14/2025 - 19:58

సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు హడావుడి చేస్తుంటారు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. కటౌట్స్, డ్యాన్స్‌లు, డైలాగ్స్‌తో ఊగిపోతుంటారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమాన సంఘాలు రచ్చ రచ్చ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇవీ కాస్తా శృతి మించి గొడవలు కూడా జరుగుతుంటాయి.

అయితే తాజాగా కేరళలోని ఓ థియేటర్‌లో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇటీవల కోలీవుడ్ స్టార్‌ అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన కొందరు ఫ్యాన్స్.. విజయ్, విజయ్ అంటూ కేకలు వేశారు. దీంతో అక్కడే అజిత్ అభిమానులు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లోని ఓ థియేటర్‌లో జరిగినట్లు సమాచారం.

కాగా.. అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్‌'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. అర్జున్ దాస్ విలన్‌గా మెప్పించారు. సిమ్రాన్ ముఖ్య అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)