Breaking News

షాకింగ్‌.. అజిత్‌ అభిమాని ఆత్మహత్య , థియేటర్లోకి అనుమతించలేదనే..!

Published on Sat, 01/21/2023 - 13:13

తమిళసినిమా: నటులపై హద్దులు మీరిన అభిమానం ప్రాణాలను బలిగొంటోంది. పొంగల్‌ సందర్భంగా విజయ్‌ నటించిన వారిసు, అజిత్‌ నటించిన తుణివు చిత్రాలు ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. అవి ఆ హీరోల అభిమానుల్లో పోటీ తత్వాన్ని పెంచేశాయి. దీంతో ఆ చిత్రాలు విడుదలైన థియేటర్ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు, గొడవలు అంటూ రచ్చరచ్చ చేశారు. భరత్‌ అనే అజిత్‌ అభిమాని ఒకరు లారీపైకి ఎక్కి డాన్స్‌ చేస్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా అజిత్‌ మరో అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాలు చూస్తే తూత్తుక్కుడికి చెందిన వీరబాహు అనే వ్యక్తి అజిత్‌ వీరాభిమాని. ఇతను గురువారం తుణివు చిత్రాన్ని తన కుటుంబసభ్యులతో కలిసి చూడడానికి థియేటర్‌కు వెళ్లాడు. అయితే ఇతను మద్యం తాగి ఉండటంతో థియేటర్‌ సిబ్బంది అతన్ని థియేటర్లోకి అనుమతించలేదు. మద్యం తాగాడని అవమానకరంగా మాట్లాడి కుటుంబసభ్యులను మాత్రమే థియేటర్‌లోకి అనుమతించారు. తనను చిత్రాన్ని చూడడానికి అనుమతించకపోగా తన కుటుంబసభ్యుల ముందే అవమానించడాన్ని భరించలేక వీరబాహు ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)