Breaking News

నా శేష జీవితం వారితోనే: అజిత్‌

Published on Mon, 11/24/2025 - 06:40

సినీ రంగంలో అజిత్‌ జీవన విధానమే ప్రత్యేకమని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు.  సినిమాలతో పాటు తన కుటుంబం అంటూ సాగుతున్న ఈయన జీవితంలోకి కొత్తగా క్రీడా పయనం వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు దానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి రైఫిల్‌ షూట్‌లోను, బైక్‌ రేసులు, కార్‌ రేసుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. అలా బెల్జియం, దుబాయి దేశాల్లో జరిగిన పలు అంతర్జాతీయ కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా సొంతంగా కార్‌ రేస్‌ పోటీల సంస్థ ప్రారంభించారు. 

 

తాజాగా అజిత్‌ కు జెంటిల్మెన్‌ డ్రైవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2025 అనే బిరుదును ఎస్‌ఆర్‌ఓ మోటార్‌ స్పోర్ట్స్‌ సంస్థ ప్రధానం చేసి సత్కరించింది. బిరుదు ప్రధానోత్సవంలో అజిత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇకపోతే అజిత్‌ తన శేష జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. తాను ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో చిత్రం చేస్తానన్నారు. అదేవిధంగా నెలలో 15 రోజులు సినిమాకు, 15 రోజులు కుటుంబానికి కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. 'నా విరామ జీవితం అంతా నా స్వీట్‌ హార్ట్‌ (శాలిని)కి, జూనియర్‌ అజిత్, శాలినిలకే. మంచి తండ్రిగా, మంచి ఉపాధ్యాయుడిగా, నిజమైన సేవకుడిగా సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.' అని పేర్కన్నారు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)