Breaking News

'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' ట్విటర్‌ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు

Published on Thu, 04/10/2025 - 07:54

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్  నటించిన 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' (Good Bad Ugly) నేడు ఏప్రిల్‌ 10న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి ఆట పూర్తి కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలలో పంచుకుంటున్నారు. దర్శకుడు  అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ బ్యానర్‌లో  వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని  నిర్మించారు. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. రీసెంట్‌టా విడాముయార్చి సినిమాలో ఈ జోడి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే,    ప్రీమియర్స్‌ షోల తర్వాత 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమా గురించి ఎలాంటి టాక్‌ వచ్చిందో తెలుసుకుందాం..

ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌ ప్రకారం ఈ సినిమా అజిత్‌ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది అని అంటున్నారు. పూర్తిగా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించాడని నెటిజన్లు తెలుపుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌ కోసం ఒక బెస్ట్‌ సినిమాను అజిత్‌ ఇచ్చారంటూ కొందరు రివ్యూవర్స్‌ చెబుతున్నారు. వింటేజ్‌ మాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.  

చాలామంది నెటిజన్లు చెబుతున్న మాట ఒక్కటే   'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' కేవలం అభిమానులకు మాత్రమే అంటూ పేర్కొనడం విశేషం. సినిమా చూసిన వారందూరు కూడా పాజిటివ్‌ రివ్యూలే ఇస్తున్నారు. సినిమాలో అజిత్‌ పాత్రను దర్శకుడు చాలా చక్కగా చూపించాడని చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్‌లు ఇద్దరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేదని కామెంట్లతో తెలుపుతున్నారు. అసలు వారిద్దరినీ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. 

'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం అజిత్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ప్లాన్‌ చేశాడని తెలుస్తోంది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్‌ ఒక రేంజ్‌లో ఉంటాయని కామెంట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వచ్చే సీన్‌ అజిత్‌ కెరీర్‌లోనే బెస్ట్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ తర్వాత కాస్త కథ నెమ్మదిస్తుందని తెలుపుతున్నారు. జీవి ప్రకాష్ బీజీఎమ్ బాగన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సీన్‌కు ఎమోషనల్ కనెక్ట్ లేదని అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తంగా అజిత్‌ ఫ్యాన్స్‌కు పండుగలాంటిదని తెలుపుతున్నారు.  సినిమా గురించి ఒక్కమాటలో 'గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్.. ఒకే ఫర్ ఆడియెన్స్.. బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్' అంటూ రివ్యూవర్స్‌ చెబుతున్నారు. 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)