Breaking News

అజిత్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. మళ్లీ తెరపైకి ‘అమరావతి’

Published on Wed, 04/26/2023 - 11:56

నటుడు అజిత్‌ ఇప్పుడు మాస్‌ పాత్రలతో స్టార్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నట పయనం ప్రేమ కథా చిత్రంతోనే మొదలైంది. అజిత్‌ నటించిన తొలి చిత్రం అమరావతి. నటి సంఘవి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని చోళా క్రియేషన్స్‌ పతాకంపై చోళా పొన్నురంగం నిర్మించారు. మొదట్లో టీవీ సీరియల్‌ నిర్మించిన ఈయన ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

కాగా నటుడు అజిత్‌ను అమరావతి చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసింది ఈయనే. వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా 1993లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమరావతి చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త హంగులు అద్ది నటుడు అజిత్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని మే 1వ తేదీన మళ్లీ తెరపైకి తీసుకురావడానికి నిర్మాత చోళ పొన్నురంగం సన్నాహాలు చేస్తున్నారు.

(చదవండి: సక్సెస్‌ లేని రకుల్‌.. మాస్‌ మసాలా పాత్రల కోసం వెయిటింగ్‌..)

దీని గురించి ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాను అజిత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన అమరావతి చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించిందన్నారు. కాగా తాజాగా అజిత్‌ అభిమానుల కోరిక మేరకు ఆ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మళ్లీ రిలీజ్‌ చేయనున్నట్లు చెప్పారు. దీనిని సుమారు 400 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందుకు అజిత్‌ అభిమానులు థియేటర్ల యాజమాన్యం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)