Breaking News

‘తునివి’ థియేటర్‌ వద్ద అపశ్రుతి, అజిత్‌ ఫ్యాన్‌ మృతి

Published on Wed, 01/11/2023 - 15:04

తమిళ స్టార్‌ అజిత్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక ఆయన సినిమా రిలీజ్‌ అంటే థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా అంతాఇంత కాదు. ఆయన తాజా చిత్రం తునివు(తెలుగులో తెగింపు) బుధవారం(జనవరి 11న) థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ వీరాభిమాని అజిత్‌ భారీ కటౌట్‌ కోసం ఏకంగా రూ. 70 లక్షలు ఖర్చు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా తునివు మూవీ ఆడుతున్న థియేటర్‌ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది.

చదవండి: ఆర్యన్‌ ఖాన్‌తో డేటింగ్‌! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్‌ నటి

ఈ రోజు తెల్లావారు జామున వేసిన స్పెషల్‌ షోలో అత్యుత్సాహంతో ఓ అభిమానికి ప్రాణాలు కోల్పొయాడు. వివరాలు.. తునివు స్పెషల్‌ షో ఈ రోజు ఉదయం తెల్లావారు జామున ఒంటి గంటలకు వేశారు. ఈ షో చూసేందుకు భారీ అభిమానులు థియేటర్‌కు వచ్చారు. అందులో భరత్‌ కుమార్‌(19) అనే అజిత్‌ వీరాభిమాని చెన్నైలోని కోయంబేడ్‌ రోహిణి థియేటర్‌కు తన మిత్రులతో కలిసి వెళ్లాడు. ఇక షో అయిపోయాకు అభిమానులంతా థియేటర్‌ ముందు కేకలు వేస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టారు.

చదవండి: అజిత్‌, విజయ్‌ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్‌

అలా ఫ్యాన్స్‌ అంతా రోడ్డు పైకికు అజిత్‌ పేరు అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అత్యుత్సాహంతో ఉన్న భరత్‌ అక్కడ మెల్లిగా కదులుతున్న నీళ్ల ట్యాంకర్‌ లారీ ఎక్కాడు. దానిపైకి ఎక్కి అజిత్‌ పేరు గట్టిగా అరుస్తూ డాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పడంతో అతడు లారీ మీద నుంచి కింద పడ్డాడు. అతడి శరీరాం నేలకు గట్టిగా తగడంలో భరత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటిన భరత్‌ కుమార్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా భరత్‌ మృతి చెందాడు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)