Breaking News

నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో

Published on Wed, 04/30/2025 - 09:00

తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.

(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్ 

ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'

(ఇదీ చదవండి: ‍థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)

'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.

తమిళ హీరోగా ‍అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.

(ఇదీ చదవండి: ‍అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)