Breaking News

అజిత్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో

Published on Mon, 03/24/2025 - 06:48

నటుడు ధనుష్‌ ఇప్పుడు నటనతో పాటూ దర్శకత్వం పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఈయన ఇటీవల వరుసగా మూడు చిత్రాలకు దర్శకత్వం వహించడం విశేషం. అందులో ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్‌ చిత్రం కమర్షియల్‌ గా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా కొత్త  తారలతో  నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోపం అనే యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ చిత్రానికీ దర్శక ,నిర్మాత బాధ్యతలను నిర్వహించారు. తాజాగా కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. ఇందులో నటి నిత్యామీనన్‌ నాయికిగా నటించారు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. కాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న మరో ద్విభాషా చిత్రం కుబేర. 

ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ నటిస్తున్నారు. కాగా త్వరలో డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆకాష్‌ భాస్కరన్‌ నిర్మించే చిత్రంలో కథానాయకుడుగా నటించరనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి అజిత్‌ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకుంది. దీని గురించి  డాన్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేత ఆకాష్‌ భాస్కరన్‌ ధృవపరిచారు. ఆయన ఓ భేటీలో పేర్కొంటూ తాను త్వరలో ధనుష్‌ కథానాయకుడిగా చిత్రం నిర్మించనున్నట్లు చెప్పారు. 

అదేవిధంగా అజిత్‌ హీరోగా ధనుష్‌ దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని, అజిత్‌ కోసం ధనుష్‌ కథను సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే అజిత్‌ను కలిసి కథను వినిపించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాజిటివ్‌ రిజల్ట్‌ వస్తుందనే తాను భావిస్తున్నట్లు నిర్మాత ఆకాష్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. ఇకపోతే అజిత్‌ కథానాయకుడిగా నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 10వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా ఈయన నటించే తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో ధనుష్‌ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపుతారా అన్న ఆసక్తి కూడా నెలకొంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)