Breaking News

అజిత్‌ కొత్త సినిమా.. మార్క్‌ ఆంటోని డైరెక్టర్‌తో..

Published on Fri, 10/13/2023 - 08:24

హీరో అజిత్‌ తన 63వ చిత్రానికి పచ్చజెండా ఊపారా? అంటే కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈయన తునివు చిత్రం తరువాత కొత్త చిత్రం చేయడానికి దాదాపు ఏడాది పట్టింది. ప్రస్తుతం నటిస్తున్న విడాముయర్చి చిత్రాన్ని ప్రకటించిన ఆరు నెలల తరువాత ఇటీవలే సెట్స్‌ పైకి వెళ్లింది. అజిత్‌ 62వ చిత్రం అయిన దీన్ని మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షనన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.

నటి త్రిష, రెజీనా నాయికలుగా నటిస్తున్న ఇందులో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్ర షూటింగ్‌ను మూడు నెలల్లో పూర్తి చేయడానికి యూనిట్‌ సభ్యులు ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. కాగా అజిత్‌ తన 63వ చిత్రానికి కూడా కమిట్‌ అయినట్లు తాజా సమాచారం. విడుదలై వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన, ప్రస్తుతం విడుదలై –2 చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్‌ఎస్‌ ఇన్ఫోటెంట్‌ సంస్థ అధినేత ఎల్‌ రెడ్‌ కుమార్‌ దీన్ని నిర్మించనున్నట్లు తెలిసింది.

ఇటీవల విశాల్‌, ఎస్‌జే సూర్య కలిసి నటించిన మార్క్‌ ఆంటోనీ చిత్రంతో హిట్‌ కొట్టిన అధిక్‌ రవిచంద్రన్‌ అజిత్‌ 63వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలి యాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

చదవండి: కూతురి వయసున్న వాళ్లతో రొమాన్స్‌? వాళ్లకే సిగ్గు లేనప్పుడు ఇంక నేను మాత్రం..

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)