10 ఏళ్ల తర్వాత రిలీజవుతోన్న స్టార్‌ హీరో మూవీ

Published on Sun, 10/27/2024 - 17:39

షూటింగ్‌ పూర్తయినా రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కొన్నుంటాయి. బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటించిన 'నామ్‌' మూవీ కూడా పై జాబితాలోకే వస్తుంది. ఈ సినిమా ఇప్పటిది కాదు.. ఏకంగా దశాబ్ధం క్రితం నాటిది! అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూంగ్ట ఎంటర్‌టైన్‌మెంట్‌, స్నిగ్ధ మూవీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్లపై అనిల్‌ రూంగ్ట నిర్మించాడు.

దశాబ్దం తర్వాత రిలీజ్‌
భూమిక చావ్లా, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. నవంబర్‌ 22న విడుదల కానున్నట్లు వెల్లడించారు. అజయ్‌-అజ్మీర్‌ డైరెక్షన్‌లో ఇది నాలుగో సినిమా.. గతంలో వీరి కాంబినేషన్‌లో హల్‌చల్‌, ప్యార్‌ తో హోనా హై, దీవాంగె (2002) సినిమాలు వచ్చాయి.

ఇద్దరివి మూడు సినిమాలు!
నామ్‌ మూవీ షూటింగ్‌ 2014లోనే పూర్తయింది. కానీ నిర్మాతల్లో ఒకరు మరణించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు దొరకలేదు. ఇన్నాళ్లకు చిక్కుముడులన్నీ విడిపోవడంతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నామ్‌ చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇకపోతే అజయ్‌ 'సింగం అగైన్‌', బజ్మీ 'భూల్‌ భులయ్యా 3' సినిమాలు నవంబర్‌ 1న రిలీజ్‌ కానుండటం గమనార్హం.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)