ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
హారర్‌కి గ్రీన్ సిగ్నల్?
Published on Tue, 03/24/2026 - 02:52
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన ‘రేంజర్, ధమాల్ 4’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘దృశ్యం 3 (హిందీ వెర్షన్), గోల్‌మాల్ 5’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నప్పటికీ ఇటీవల మరో కొత్త సినిమాకు అంగీకారం తెలిపారని బాలీవుడ్ సమాచారం.
హిందీలో ‘జేమ్స్’, పంజాబీలో ‘సర్దాజ్ జీ, సర్దార్ జీ 2’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్ జుగ్రాస్ ఇటీవల ఓ హారర్ కథను అజయ్ దేవగన్ కు వినిపించారట. కథ, హారర్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని రోహిత్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Tags : 1