Breaking News

బాలీవుడ్‌ సినిమాలో జాకీ చాన్‌?

Published on Wed, 05/28/2025 - 16:58

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన కరాటే కిడ్ ఫ్రాంచైజ్ మరోసారి తెరపైకి రానుంది. మే 30న విడుదల కానున్న కరాటే కిడ్: లెజెండ్స్ చిత్రంలో లెజెండరీ యాక్షన్ హీరో జాకీ చాన్ మిస్టర్ హాన్‌గా తిరిగి కనిపించనున్నారు. ఈ సినిమాలో బెన్ వాంగ్ హీరోగా నటిస్తుండగా, రాల్ఫ్ మాకియో డేనియల్ లారూసో పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాకు హిందీ డబ్బింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు గొంతు ఇవ్వగా, అతని కుమారుడు యుగ్ దేవగణ్ బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు వాయిస్‌ ఓవర్‌తో సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. తండ్రి-కొడుకు ఇద్దరూ ఒకే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి, ఇది బాలీవుడ్‌లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది.

తాజాగా జాకీ చాన్, బెన్ వాంగ్‌తో కలిసి అజయ్ – యుగ్ దేవగణ్ ఆన్‌లైన్‌ లో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్.. తన తండ్రి వీరు దేవగణ్ గురించీ, జాకీ చాన్ గురువు మిస్టర్ మియాగీగురించి మాట్లాడారు. యుగ్ దేవగణ్ తన తండ్రి లేనిదే నేను లేను అని చెప్పాడు. అలాగే అజయ్.. ఇప్పుడు యాక్షన్ సీన్స్ చాలా ఈజీ. మునుపటిలా కేబుల్స్ వాడి గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వలన తేలికైంది. కానీ హార్డ్ వర్క్‌కి మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం లేదు అని తెలిపారు. అలాగే బాలీవుడ్‌లో ఓ చిత్రం చేయాలని జాకీ చాన్‌ అన్నారు.“నీవు ఫైట్ చేస్తావు, నేను డ్యాన్స్ చేస్తా” అని అజయ్‌తో జోక్ చేస్తూ, భవిష్యత్తులో బాలీవుడ్‌లో కలిసి పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)