అలాంటిపాత్రలు రెగ్యులర్‌గా రావు: అజయ్‌

Published on Sun, 10/20/2024 - 03:46

‘‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత ఆ స్థాయిలో విలన్‌ వేషాలు నాకు తక్కువగానే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళిగారి సినిమాల్లోనే ఉన్నాయి. టిట్ల (‘విక్రమార్కుడు’లో అజయ్‌పాత్ర) లాంటి క్యారెక్టర్స్‌ రెగ్యులర్‌గా రావు. ఇక ‘΄పొట్టేల్‌’ సినిమాలో నేను చేసిన పటేల్‌ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్‌ ఉన్నాయి. నటుడిగా సంతోషం ఇచ్చినపాత్ర ఇది’’ అని అజయ్‌ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్‌’. సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్‌ అవుతోంది.

ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ రోల్‌ చేసిన అజయ్‌ మాట్లాడుతూ– ‘‘సాహిత్‌ చెప్పిన కథ, నాపాత్ర బాగా నచ్చాయి. పటేల్‌పాత్రని అద్భుతంగా చేయాలనిపించింది.పాప చదువు కోసం ΄ోరాటం చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మూఢ నమ్మకాలు, వాటిని అడ్డం పెట్టుకుని బతికే మనుషులు, మొండితనం, గ్రామదేవతల గురించి ఈ సినిమా ఉంటుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు విజిల్స్‌ వేస్తారు. డైరెక్టర్స్‌ కొరటాల శివ, సందీప్‌ రెడ్డి వంగాగార్లకి ఈ సినిమా చూపించాను... వారికి బాగా నచ్చింది. ఇక హిందీలో అజయ్‌ దేవగన్‌గారితో ‘సింగం ఎగైన్‌’ చేశాను. ‘పుష్ప–2 ది రూల్‌’ చేస్తున్నాను. అలాగే తమిళ, మలయాళ సినిమాలు కూడా  చేస్తున్నాను’’ అన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)