Breaking News

నేను చనిపోవాలట.. వారికేం వస్తుందో మరి!: బుల్లితెర నటి

Published on Fri, 03/22/2024 - 12:44

ఒకప్పుడు సెలబ్రిటీలను ఆరాధించేవారు. పొగడ్తలే ఎక్కువగా వినిపించేవి.. విమర్శలు అంతగా ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా ముఖం పట్టుకుని తిట్టేంత సీన్‌ అయితే లేదు. కానీ సోషల్‌ మీడియా పుణ్యమాని తారలు ఏ పోస్ట్‌ పెట్టినా.. అక్కడే తిట్టేస్తున్నారు, నోటికొచ్చింది అనేస్తున్నారు. ఇలాంటి ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ బాధితురాల్లో బుల్లితెర నటి ఐశ్వర్య శర్మ ఒకరు.

నేను చనిపోవాలట
ఒకరైతే ఏకంగా ఆమెను చచ్చిపోమని కోరారు. దానికి ఐశ్వర్య.. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నేను మాత్రం.. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలనే కోరుకుంటున్నానని రిప్లై ఇచ్చింది. ఈ ట్రోలింగ్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. 'ట్రోలింగ్‌ అనేది ఒక దినచర్యలా మారిపోయింది. ప్రతిరోజూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నేను ఏ తప్పూ చేయలేదు అయినా అటువంటి కామెంట్స్‌ వస్తుంటే బాధగా ఉంటుంది. మరోవైపు నా అభిమానులు చాక్లెట్స్‌, పువ్వులు.. ఇలాంటి బహుమతులు పంపుతూ ఉంటారు. గిఫ్టులు తీసుకోవడంలో నాకే ఇబ్బందీ లేదు. కానీ ఏ కారణం లేకుండా నా కోసం ఖర్చు పెట్టొద్దని నా అభిప్రాయం. అందుకే వారిని బహుమతులు పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

బహుమతులు, విమర్శలు.. ఏదీ వద్దు
అయినా వాళ్లు వినరు.. కానీ ఓసారి గుర్తు చేయాలనుకున్నాను. ఓ వ్యక్తి దీన్ని కూడా తప్పుపట్టి నాపై విమర్శలు గుప్పించాడు. నేను కూడా ఒక మనిషినే.. నేనేదైనా తప్పు చేస్తే మీరు ఇష్టమొచ్చినట్లు తిట్టండి, ప్రశ్నించండి. కానీ ఏమీ చేయకపోయినా నన్ను అనరాని మాటలు అంటున్నారు. అదెందుకో అర్థం కావడం లేదు. నాకు ఎవరి బహుమతులు వద్దు, ఎవరి విమర్శలూ వద్దు. ట్రోలింగ్‌ వల్ల నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. నేను చచ్చిపోతే వారికి మనశ్శాంతి వస్తుందా?

శాడిస్టులు..
ముందేమో తిడతారు.. నటులు ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడతారు. అసలు మీకు దాని గురించి మాట్లాడే హక్కు లేదు. కొందరు శాడిస్టులు పక్కవాళ్లను మాటలతో హింసించి ఆనందం పొందుతారు. సెలబ్రిటీల జీవితం ఎంతో ఆకర్షణీయంగా బాగుంటుందనుకుంటారు. కానీ దాని వెనక వారు పడ్డ కష్టాలను ఎవరూ పట్టించుకోరు. ఒక ఆర్టిస్టుగా నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక నెగెటివ్‌ రోల్‌ చేస్తే నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాననుకుంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్‌?' అని ఆవేదన వ్యక్తం చేసింది నటి ఐశ్వర్య.

చదవండి: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)