Breaking News

ప్రేమలో పడ్డ ఐశ్వర్య రజనీకాంత్‌.. ఆమె మాటలే చెప్తున్నాయ్‌!

Published on Mon, 03/18/2024 - 17:21

కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడిపోయి రెండేళ్లు అవుతోంది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం విడిపోయినప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం, గౌరవం అలాగే ఉందని, అందుకు నిదర్శనం ఐశ్వర్య ఇప్పుడు తన మాజీ భర్త ధనుష్‌ గురించి మాట్లడమేనని నెటిజన్లు అంటున్నారు. పెళ్లయి 18 ఏళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట ఇప్పుడు మళ్లీ ఒక్కటవుతుందని కోలీవుడ్‌లో పుకార్లు వస్తున్నాయి.

విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ధనుష్‌, ఐశ్వర్య విడివిడిగా జీవిస్తున్నారనే విషయం తెలిసిందే. భార్యాభర్తలుగా కలిసి లేకున్నా.. ఇద్దరూ మంచి స్నేహితులని ఐశ్వర్య మాటలే నిదర్శనం. ఐశ్వర్య తన దర్శకత్వం వహించిన లాల్ సలామ్ కోసం ఒక ఇంటర్వ్యూలో ధనుష్ గురించి మాట్లాడింది. దీంతో ఇద్దరూ తిరిగి మళ్లీ కలుసుకోనున్నారని ఊహాగానాలకు దారితీసింది. దక్షిణాది సినిమాకి చెందిన ప్రముఖ సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్ సినీ జర్నీ వెనుక  ధనుష్‌ ఉన్నాడని ఆమె ఇలా చెప్పుకొచ్చింది. 

అనిరుధ్ రవిచందర్ పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన '3' చిత్రానికి అనిరుధ్ మొదట సంగీతాన్ని అందించాడు. అప్పుడు అతని వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. అలాంటి కుర్రాడు సంగీత దర్శకత్వం వహించాలనేది ధనుష్ కోరికని.. అనిరుధ్‌ నేడు ఇంత స్థాయికి చేరుకున్నాడంటే అందుకు కారణం ధనుష్‌ అని ఆమె చెప్పింది.

గత కొన్ని సంవత్సరాలుగా, అనిరుధ్ రవిచందర్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత స్వరకర్తలలో ఒకరిగా మారారు. నేడు దక్షిణాదిలోని ప్రతి దర్శకుడి మొదటి ఎంపిక అతనే. 2012లో '3' సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సినిమాలోని 'కొలవెరి డి..' పాట ఆప్పట్లో పెద్ద సెన్సేషన్‌ అని అందరికి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఐశ్వర్యకు కజిన్ అవుతాడు. కానీ ధనుష్ మాత్రం అనిరుధ్‌లోని ప్రతిభను గుర్తించాడని ఐశ్వర్య తెలిపింది. అనిరుద్ సక్సెస్ జర్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అతను మా బంధువు అయినందుకు సంతోషంగా ఉంది. ధనుష్ వల్లే అనిరుధ్ సినిమాల్లోకి వచ్చాడు.

అనిరుధ్‌ను మొదట సింగపూర్‌కు పంపించి చదివించాలని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ధనుష్ మాత్రం సంగీతంపై మక్కువ కొనసాగించాలని అన్నారు. ప్రతిభను ఎలా గుర్తించాలో ధనుష్‌కి తెలుసు. ఇక్కడే ఉండి విజయాన్ని అందుకోవాలని అనిరుధ్‌ని ధనుష్ ఒప్పించాడని ఐశ్వర్య తెలిపింది. కీబోర్డ్ కొనడం నుంచి పాటలు రాయమని ఒత్తిడి చేయడం వరకు ప్రతిదానికీ ధనుష్‌కే క్రెడిట్ ఉంది. అనేలా ఐశ్వర్య తెలిపింది. దీంతో తన మాజీ భర్త ధనుష్‌తో ఐశ్వర్య మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై ఆమె నుంచి ఎలాంటి ప్రకటన జరగలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)