Breaking News

ఆ ఒక్క పాట సినిమాను చంపేసింది: ఐశ్వర్య రజనీకాంత్‌

Published on Tue, 02/13/2024 - 10:20

హీరో ధనుష్‌ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ చేసిన పాట 'వై దిస్‌ కొలైవెరి..'. ధనుష్‌ రాసిన ఈ పాటకు అనిరుధ్‌ బాణీలు కట్టారు. ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకురాలిగా పరిచయం అయిన '3' చిత్రంలోనే పాటే ఇది! 2012లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆపరేషన్‌ సక్సెస్‌ పేషెంట్‌ డెడ్‌ అన్న సామెత మాదిరి ఈ మూవీలో వై దిస్‌ కొలైవెరిడీ పాట విపరీతంగా పాపులర్‌ అయ్యింది. ఎంతగా అంటే స్వయంగా దేశ ప్రధాని అప్పట్లో ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ను విందుకు ఆహ్వానించి అభినందించారు.

సినిమాను చంపేసింది
ఆ సమయంలో ఏ వీధిలో చూసినా వై దిస్‌ కొలైవెరి పాటే వినిపించేది. అయితే ఈ పాట 3 చిత్రాన్ని చంపేసిందని ఆ సినిమా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్‌ వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె డైరెక్ట్‌ చేసిన కొత్త మూవీ లాల్‌ సలామ్‌. రజనీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. ఏఆర్‌.రెహ్మన్‌ సంగీతాన్ని అందించిన ఈ మూవీ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్‌ తన తొలి చిత్రం 3 గురించి ప్రస్తావించారు. 

పాట వల్లే సినిమా మరుగునడపింది
జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరగాలని ఉంటే వాటికి మనం సిద్ధపడాలన్నారు. తన జీవితంలో 3 చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందన్నారు. అందులోని వై దిస్‌ కొలైవెరి సాంగ్‌ అనూహ్య విజయాన్ని సాధించిందన్నారు. అయితే అది చిత్రానికి బలం కావాల్సింది బలహీనంగా మారిందన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాట చిత్రాన్ని చంపేసిందన్నారు. ఇటీవల రీ రిలీజ్‌ అయినప్పుడు పలువురు తనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారన్నారు. చిత్ర నిర్మాణ సమయంలో గానీ, మొదటగా విడుదల అయినప్పుడు రాని అభినందనలు ఇప్పుడు రావడానికి కారణం వై దిస్‌ కొలైవెరి పాట చిత్రాన్ని మరుగున పడేయడమేనని ఐశ్వర్య పేర్కొన్నారు.

చదవండి: శింబు సినిమాలో కమల్‌ హాసన్‌ గెస్ట్‌ రోల్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)