Breaking News

ధ్రువ నక్షత్రం చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ సీన్స్‌ కట్‌?

Published on Sun, 07/23/2023 - 09:20

ధ్రువ నక్షత్రం చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్‌ నటించిన సన్నివేశాలను తొలగించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం. ఇందులో నటి రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్‌, సిమ్రాన్‌, నటుడు పార్టీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం 2017లో ప్రారంభమైంది. షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం విడుదల కావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

అలా అటకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బూజు దులుపుతున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మనం అనే పాటను విడుదల చేశారు. తాజాగా హిజ్‌ నేమ్‌ ఈజ్‌ జాన్‌ అనే మరో పాటను విడుదల చేశారు. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర కథను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.

అందులో భాగంగా ఇప్పటికే చిత్రీకరించిన నటి ఐశ్వర్య రాజేష్‌కు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని తొలగించినట్లు, ఆమె లేకుండా మళ్లీ కొంత భాగాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదు. కాగా పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించిన నటి ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)