Breaking News

హీరో విక్రమ్‌తో మరోసారి జతకట్టనున్న ఐశ్వర్య రాయ్‌

Published on Fri, 05/12/2023 - 08:33

క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేయడంలో దర్శకుడు మణిరత్నం దిట్ట. ఇంతకుముందు రజనీకాంత్‌, మమ్ముట్టి, అరవింద్‌ స్వామి కాంబినేషన్‌లో దళపతి చిత్రం చేసిన ఈయన ఆ తరువాత శింబు, అరవిందస్వొమి, విజయ్‌ సేతుపతి, ప్రకాష్‌ రాజ్‌, జ్యోతిక, అదితి రావు తదితరులు కాంబోలో చెక్క చివంద వానం తాజాగా విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌ కుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రభు వంటి ప్రముఖ తారాగణంతో పొన్నియిన్‌ సెల్వన్‌ సీక్వెల్స్‌ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు.

ముఖ్యంగా పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రంలో మాజీ ప్రేమికులైన విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, దీని తర్వాత మరో క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. అదే పొన్నియిన్‌ సెల్వన్‌ క్రేజీ కాంబినేషన్‌.

క్లియర్‌గా చెప్పాలంటే నటుడు విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌ హీరో హీరోయిన్లుగా చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ఈ కాంబినేషన్లో ఇంతకుముందు మణిరత్నం రావణన్‌ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. కమలహాసన్‌తో చేసే చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌ల కాంబోలో చిత్రం మొదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)